తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం,నల్లబెల్లి మండలంలోని నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయితీ అయిన కొండాయిలుపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది.ఈ గ్రామమంతా ఐక్యతగా రానున్న వినాయకచవితి నేపద్యంలో ఒకేచోట పండుగ జరుపుకుంటామని ఒకే విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని,అది కూడా పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని గ్రామపంచాయితి తీర్మాణం చేసింది.
ఇటివల సిద్దిపేట లోని మిట్టపల్లి గ్రామంలో తొలిసారి ఈ తీర్మాణం చేసారు. రాష్ట్రంలోనే ఈ తీర్మాణం చేసిన రెండవ గ్రామంగా కొండాయిలు పల్లి నిలిచింది.సర్పంచ్ మామిండ్ల మోహన్ రెడ్డి,ఎంపీటీసీ జయరాజ్,పంచాయితి కార్యదర్శి విష్ణు ఉపసర్పంచ్ సదయ్య వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు ,అభివృద్ది కమిటీ,రైతుసమన్వయసమితి,అంగన్ వాడి టీచర్,ఆశవర్కర్ సమక్షంలో ఈ తీర్మాణాన్ని చేసారు.
ఇప్పటికే కొండాయిలుపల్లి గ్రామంలో సుమారు 10 సంవత్సరాలుగా మద్యపాన నిషేదం అమలులో ఉంది.దీంతో పాటు కొత్తగ్రామపంచాయితీగా ఏర్పాటైనా ఎలాంటి ఎన్నిక లేకుండా సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుని గ్రామం ఐక్యత చాటింది.మరోమారు నూతన సర్పంచ్,నూతన కార్యదర్శి,నూతన కార్యవర్గం మరో కొత్త ఒరవడిని సృష్టిస్తూ మరోమారు ఐక్యత,ఆదర్శాలను చాటింది కొండైలు పల్లి గ్రామం..
Post Views: 351