ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది మంత్రి వర్గ విస్తరణ అని ఎదురుచూస్తున్న ఆశావాహులకు శుభవార్త ఇది. ఇటీవల అధికారాన్ని చేపట్టిన బీజేపీ ఈ నెల ఇరవై తారీఖున మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప తెలిపారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఆమోదముద్రతో.. ఆగస్ట్ 20వ తేదీ మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ఆధారంగా మొత్తం 34 మందిని మంత్రులుగా నియమించేందుకు వీలుంది. అయితే యెడ్డీ తన తొలి కేబినెట్లో 13మంది మంత్రులను మాత్రమే తీసుకునే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
