దేశంలోప్రస్తుతం క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న మహిళా ప్రయాణీకులపై క్యాబ్ డ్రైవర్లు ఏదో రకంగా లైంగికంగా వేధిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకొంటున్నా ఈ ఘటనలు ఆగడం లేదు.తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహా నగరంలో క్యాబ్‌లో ఒంటరిగా ఉన్న మహిళ పట్ల క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు ప్యాంట్ విప్పి తన మర్మాంగాలను చూపాడు. ఈ విషయం ఎవరీకీ చెప్పకూడదని బెదిరించాడు.మహిళా ప్రయాణికురాలితో క్యాబ్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ..తన మర్మంగాలను చూపిస్తూ వికృతానందం పొందిన ఘటన హైద్రాబాద్‌లో చోటుచేసుకొంది. కారును మధ్యలో ఆపి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరింపులకు దిగాడు.
అసలు విషయం ఏమిటంటే …
హైదరాబాదు నగరంలోని కొండాపూర్‌లో నివసిస్తున్న ఒక మహిళ 19న ఢిల్లీ వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఆమె బుక్ చేసుకుంది. హఫీజ్‌పేటకు చెందిన ప్రేమ్‌కుమార్ క్యాబ్‌లో ఉదయం 7.05 గంటలకు మహిళ ఇంటి నుంచి బయల్దేరింది. వాహనం ఓఆర్‌ఆర్ మీదకు వెళ్లగానే ఆ మహిళను అద్దంల్లోంచి చూస్తూ ప్యాంట్‌ను విప్పి మర్మాంగాలను చూపించాడు. షాక్‌కు గురయిన ఆ ప్రయాణికురాలు పోలీసులకు ఫోన్ చేయడానికి యత్నించింది. అయితే ఈ విషయాన్ని గమనించిన ప్రేమ్ కుమార్ కారును ఆపి.. ఈ విషయం పోలీసులకు చెప్పొద్దని బెదిరింపులకు దిగాడు. ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఇదంతా స్థానికులు గమనిస్తుండటంతో తేరుకున్న క్యాబ్‌డ్రైవర్.. ఆ మహిళను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లాడు. ఢిల్లీకి చేరుకున్న ఆమె.. 1091కు ఫోన్‌చేసి విషయం చెప్పింది. సఫ్‌దార్‌జంగ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అలాగే, ఫేస్‌బుక్, మెయిల్ ద్వారా సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది. సీరియస్‌గా తీసుకున్న సీపీ సందీప్ శాండిల్య నిందితుడిని పట్టుకోవాలని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్‌ను ఆదేశించారు. రెండు బృందాలు రంగంలోకి దిగాయి. రంగారెడ్డి జిల్లా, బషీరాబాద్ మండలం, నావల్గకి చెందిన క్యాబ్ డ్రైవర్ ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పాడు. దీంతో ప్రేమ్‌కుమార్‌ని అరెస్ట్ చేశారు. క్యాబ్ డ్రైవర్లు మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని మాదాపూర్ డీసీపీ హెచ్చరించారు.