టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గాయాలు అయ్యాయి.మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మగుళూరు ప్రాంతంలో జరుగుతుంది .ఈ క్రమంలో ఒక యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్న సమయంలో స్వల్ప ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.ఈ ఫైట్ సీన్ లో ఇప్పటికే ఆయనకు ఒక గాయం అయింది .
అయితే దాన్ని లెక్క చేయకుండా పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు అని ఆ చిత్రం వర్గాలు తెలిపాయి . ఇక తాజా ఘటనలోనూ ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ గాయం కూడా చిన్నదేనని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.ఎవరు భయపడాల్సిన పని లేదని చిత్రం యూనిట్ వర్గాలు తెలిపాయి .