మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీఎల్పీ ఉప నేత పదవికి తాను రాజీనామా చేయనున్నట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన గుంటూరుకు వచ్చారు. ఈ సమయంలో ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు.తాను రాజీనామా చేసిన అనంతరం ఆ పదవిని బీసీలకు ఇవ్వాలన్నారు. తెలుగుదేశం పార్టీలో వైట్ ఎలిఫెంట్స్ ను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇక నుంచి తాను ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. మరో వైపు పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్లు పార్టీ పదవుల నుండి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
