కృష్ణా కరకట్ట మీద బాబు ఇంటికి వరద ముంపు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు చేరడంతో అన్నీ గేట్లు ఎత్తేసి…దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. దీంతో పులిచింతల డ్యామ్‌కు బారీగా వరద నీరు చేరుతుంది. తాజాగా పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లను దాటుకుని ప్రకాశం బ్యారేజీ వైపు ఉధృతంగా పరిగెడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ వరద తీవ్రత మరింత పెరిగితే.. కృష్ణా నది కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటికి వరద ముప్పు తప్పకపోవచ్చని అధికారులు, వరద ముంపు నిపుణులు అంటున్నారు. కృష్ణా నదీ కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్‌హౌస్‌లో నివాసముంటున్నారు చంద్రబాబు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి హైదరాబాద్ నుంచి తరలివచ్చిన చంద్రబాబు…అప్పటి నుంచి ఈ గెస్ట్‌హౌస్‌లోనే ఉంటున్నారు. అలాగే ప్రజావసరాల కోసం భారీగా ప్రజావేదిక కూడా నిర్మించారు. అయితే ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు అదే అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నాడు. అయితే కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కోర్ట్ కూడా ఆదేశించింది.ఇటీవల జగన్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసింది. అంతే కాదు చంద్రబాబు ఇంటికి కూడా అధికారులు నోటీసులు అంటించారు కూడా. తాజాగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. దీంతో కృష్ణా నది కరకట్ట మీద చంద్రబాబు ఇంటిని వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. మొత్తానికి అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు వదలని ఆ ఆక్రమ నివాసం వరద ముంపుకు గురవుతుందనే వార్త…ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
