బాలీవుడ్ హాటెస్ట్ స్టార్ కంగనా రనౌత్ బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడంలో ఎప్పుడూ ముందే వుంటుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎలాంటి విషయాన్నైనా నిర్భయంగా చెప్పగలదు. ధైర్యం ఎక్కువ. ఆ ధైర్యంతోనే బోలెడన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇండస్ర్టీలో గుడ్ ఫ్రెండ్స్ అనేవారు ఉండరు. అదంతా వేరే టైప్ బ్యాచ్ అంటుంది. తన ప్రేమ గురించి, బ్రేకప్ గురించి ప్రపంచానికి నిర్మొహమాటంగానే చెప్పేస్తుంది. ఆదిత్యా పంచలోలియాతో ప్రేమ వ్యవహారం, అద్యాయన్ సుమన్‌తో లవ్, ఇప్పుడు హృతిక్ రోషన్‌తో పెద్ద గొడవ. అన్ని వ్యవహారాల్లోనూ అభిప్రాయాలను, తన పాయింట్‌ను చెప్పుకొస్తొంది.
తాజాగా శృంగారంపై మరో ఘాటు వ్యాఖ్య చేసింది. పురుషుల విషయంలో సెక్స్ అంటే ఓ సరదా, వినోదం లాంటిదని ఆరోపించింది. ఐతే ఇది స్త్రీల విషయంలో ఓ నరకం అని చెప్పుకొచ్చింది. శృంగారంపై గతంలో ఎన్నో ప్రకటనలు చేసిన కంగనా రనౌత్ ఇప్పుడు తాజాగా బాలీవుడ్ పురుష ప్రపంచంపై ఓ రేంజిలో మండిపడింది.
