కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి ఎం.దీపిక పాటిల్, నంద్యాల ఓఎస్డీగా ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా ఇక్కడ ఏఎస్పీగా ఉన్న ఆంజనేయులును నంద్యాల ఓఎస్డీగా ప్రభుత్వం నియమించింది. ఈ స్థానంలో తిరుపతి ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న దీపిక పాటిల్‌ను నియమించింది. ఇద్దరూ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఆంజనేయులు ఈ ఏడాది మార్చి 8న విధుల్లో చేరారు. ఐదు నెలల పాటు అడిషనల్ ఎస్పీగా పనిచేసి.. నూతనంగా నియమితులైన దీపిక పాటిల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈమె 2014లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తయిన తర్వాత కొంత కాలం గ్రేహౌండ్స్, మరికొంతకాలం పార్వతీపురం ఏఎస్పీగా పనిచేశారు. తిరుపతి ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేసిన తర్వాత ఐదు నెలల పాటు సెలవులో వెళ్లారు. ఆ తర్వాత బదిలీపై కర్నూలుకు వచ్చారు. ఈమె భర్త విక్రాంత్‌పాటిల్ గుంతకల్ రైల్వే ఎస్పీగా పనిచేస్తున్నారు. దీపికపాటిల్ తండ్రి వెంకటేశ్వరరావుది కృష్ణా జిల్లా ఆముదాల లంక. ఆయన సీఆర్పీఎఫ్లో ప్రస్తుతం ఐజీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పోలీసు శాఖలో సాంకేతిక సేవలను మరింత విస్తృతం చేసి.. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామని దీపికపాటిల్ స్పష్టం చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప సహకారంతో పోలీసు సిబ్బందికి సంబంధించి పెండింగ్ ఫైళ్లను వేగంగా పరిష్కరిస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తినా తగిన చర్యలు చేపడతామన్నారు. అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ , డీఎస్పీలు వెంకటాద్రి, ఇలియాజ్ బాషా, ఏఓ సురేష్‌బాబు, ఆర్ఐలు జార్జ్, రామకృష్ణ, రవి, రంగస్వామి తదితరులు ఏఎస్పీ దీపికపాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. దీపికపాటిల్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్పీ ఫక్కీరప్ప, డీఐజీ వెంకట్రామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Tags asp Deepika Patil kurnool
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023