దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ మహిళా నేత ,కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన సంగతి విదితమే. సుష్మా మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో యువనేత కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ లో స్పందిస్తూ.. సుష్మా స్వరాజ్తో భేటీయైన ప్రతిసారీ ఎంతో ప్రేరణతో బయటకు వచ్చేవాడిని. ఆమె నిజమైన నాయకురాలు. ప్రపంచ దేశాల్లో నివసిస్తున్న భారతీయులెవరైనా ఆపదలో చిక్కుకొని సాయం కోరుతూ ఒక్క ట్వీట్ చేస్తే చాలు తక్షణం స్పందించి పరిష్కరించేవారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీటులో తెలిపారు.