ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్కైన టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్, మోజీ టీవీ సీఈవో రేవతిల మోసం బయటపడింది. టీవీ 9 నిధులను మోజో టీవీకి మళ్లించిన రవిప్రకాష్ అనధికారికంగా టీవీ 9 కు ప్రత్యామ్నాయంగా మోజీ టీవీని నడిపించిన సంగతి తెలిసిందే. ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లినప్పుడు మోజో టీవీ సీఈవో రేవతి నానా రచ్చ చేసింది. జర్నలిస్టుల గొంతు నొక్కేస్తున్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మోజీ టీవీ యాజమాన్యం చేతులు మారింది. ఇక్కడే రవిప్రకాష్, రేవతిలు కలిసి మరో పన్నాగానికి పాల్పడ్డారు. ఏకంగా మోజీ టీవీ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారు. రవి ప్రకాష్ చేసిన మోసం బయటపడిన తర్వాత కొత్త యాజమాన్యాన్ని కలిసిన రేవతి…తప్పు జరిగిపోయిందని, మోజోకు మీకు అప్పగిస్తాం..కానీ ఉద్యోగులకు అన్యాయం చేయలేము కాబట్టి…వారికి మూడు నెలల జీతం అడ్వాన్స్ ఇచ్చి వేరే ఉద్యోగాలు చూసుకోమని చెబుతాం అని వివరించింది. మూడు నెలల్లో ఛానల్‌ను మూసివేస్తాం అని చెప్పి..కొత్త యాజమాన్యం దగ్గర రూ. 5 కోట్లు తీసుకుని, ఉద్యోగులకు ఇవ్వకుండా రేవతే ఉంచుకున్న విషయం ఉద్యోగులకు ఆలస్యంగా తెలిసింది. ఇచ్చిన గడువు ముగియడంతో ఆరా తీసిన యాజమాన్యానికి రేవతి చేసిన మోసం అర్థమైంది.
అయితే ఉద్యోగులు కొత్త యాజమాన్యం దగ్గరకు వెళ్లి…ఒక్కసారిగా ఎందుకు మూసివేస్తారు. మాకు టైం ఇవ్వండి అని అడుగగా..అదేంటి..మీకు మూడు నెలల కిందటే 5 కోట్లు ఇచ్చి సెటిల్ చేశాం కదా…అని యాజమాన్యం నుంచి సమాధానం రావడంతో అవాక్కవడం ఉద్యోగుల వంతు అయింది. దీంతో ఫోర్జరీ ప్రకాష్, రేవతిలు కలిసి తమ జీవితాలతో ఆడుకున్నారని..మోజీ టీవీ ఉద్యోగులకు అర్థమైంది. అయితే కొత్త మేనేజ్‌మెంట్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక..అందరికీ 3 నెలల జీతంతో పాటు, అలాగే వీలైనంత మందికి వేరే సంస్థలలో ఉద్యోగం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మేనేజ్‌మెంట్ హామీతో ఉద్యోగులంతా ఒప్పుకున్న తర్వాతే మోజో టీవీని మోసం చేయడం జరిగింది. కానీ సొంత ఉద్యోగులను మోసం చేసిన రేవతి మాత్రం..తోటి జర్నలిస్టులను రెచ్చగొడుతుందని మోజీ టీవీ ఉద్యోగులు అంటున్నారు. రవిప్రకాష్, రేవతిల కుట్రలకు మనం మరొక్కసారి బలికావద్దు..వారు ఎలాంటి వారు అనే విషయం…జర్నలిస్ట్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియనిది కాదు..అంటూ మోజీ టీవీ ఉద్యోగులు ప్రతికాముఖంగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మోజో టీవీ ఉద్యోగుల ప్రెస్‌నోట్, ఆఖరికి ఉద్యోగులకు జీతాలు ఇస్తామని కొత్త మేనేజ్‌మెంట్ దగ్గర 5 కోట్లు తీసుకుని ఒక్కపైసా ఇవ్వకుండా నొక్కేసిన రేవతి, రవి ప్రకాష్‌ల బాగోతం బయటపడింది. మొత్తానికి రవి ప్రకాష్, రేవతిలు సొంత ఉద్యోగులనే మోసం చేసి మరోసారి అడ్డంగా దొరికిపోయారు.