టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాలని కోరడం జరిగింది. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అమిత్ షాకు ఇచ్చారు. మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సైతం కలిసి విభజన హామీలను మొత్తం పూర్తిగా నెరవేర్చాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్దికి తోడ్పడాలని ఇరువురికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అనంతరం రాజ్ నాథ్ సింగ్ కి కూడా శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.