వనపర్తి జిల్లా, అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు జూరాల ప్రాజెక్టులో 22 గేట్స్ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఇన్ ఫ్లో :1.62.834 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో : 1.67.370 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీట్టి నిల్వ : 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.459 టీఎంసీలు ఉంది. ఇక ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం అడుగులు కాగా ప్రస్తుత నీట్టి మట్టం 318.420 అడుగులకు చేరుకుంది. ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 3 యూనిట్లలో 117 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా, ఆత్మకూరు మండలం, లోయర్ జూరాల విద్యుత్ కేంద్రంలో (జెన్కో) లో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మొత్తం 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. మొత్తంగా జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకోనున్నాయి.
Tags flowing jurala project telangana water