రామన్నా అంటే నేనున్నా అంటూ భరోసా ఇచ్చే యువ నాయకులు కేటీఆర్. కొన్నాళ్ళ క్రితం ట్విట్టర్ ద్వారా తనను కలవాలని ఉంది అంటూ ట్వీట్ చేసిన దివ్యాంగుడు నాయిని సందీప్ రెడ్డిని ఇవ్వాళ కలిశారు.పుట్టుకతోనే శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేయని సందీప్ అతి కష్టం మీద కంప్యూటర్, మొబైల్ మీద టైప్ చేయడం నేర్చుకున్నాడు. వయసు 26 ఏళ్లు వచ్చినా ఇంకా చాలా విషయాల్లో చిన్న పిల్లవాడి మనస్తత్వమే. కొన్ని రోజుల క్రితం కేటీఆర్ గారిని కలవాలని ఉంది అని ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన కేటీఆర్ ‘త్వరలోనే కలుద్దాం’ అని బదులిచ్చాడు.
ఇవ్వాళ కేటీఆర్ ను కలిసిన సందీప్ సంతోషానికి అవధులు లేవు. వచ్చీరాని మాటలతోనే తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సందీప్ కు తండ్రి లేడు. వారి మాతృమూర్తి నుంచి వివరాలు తెలుసుకున్న కేటీఆర్, సందీప్ కుటుంబానికి ఉండడానికి ఇల్లు, ఇప్పుడు వస్తున్న పెన్షన్ తో పాటు మరేదైనా జీవనాధారం చూస్తాను అని హామీ ఇచ్చారు.
TRS Party Working President @KTRTRS met Sandeep, a differently-abled man from Mailardevpally at Telangana Bhavan today. Sandeep approached #KTR on twitter asking for an employment opportunity. KTR assured to provide Sandeep a data entry job in their village. pic.twitter.com/JFY04KOhb6
— KTR News (@KTR_News) August 1, 2019