మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సిద్ధిపేట నియోజకవర్గంలో హరిత హారం కార్యక్రమం పై అధికారులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..”గ్రామంలో అన్ని కుల సంఘాలు, మహిళ,యువ,రైతు మరియు ఇతర సంఘాలు అన్ని ఒక నిర్ణయం తీసుకొని హరితహారం విజయ వంతం చెయ్యాలి. ప్రజలను బాగా స్వామ్యం చేస్తే హరితహారం విజయ వంతం అవుతుంది. ఏ కార్యక్రమంలో అయిన నేను అనుకుంటే విజయవంతం కాదు మనము అనుకుంటేనే విజయవంతం అవుతుంది. మనం అభివృద్ది పనులు ఎన్ని చేసిన గాలి ని మాత్రం సృష్టించలేము అన్నింటి కంటే విలువైనది ,మనవకోటికి జీవం స్వచ్ఛమైన గాలి. చెట్లను నాటండీ ప్రకృతి తో అటలాడవద్దు , విస్మరిస్తే ప్రకృతి విలయ తాండవం చేస్తాది. గ్రామ అభివృద్ధి నిరంతర ప్రక్రియ , దింతో పాటు మొక్కలని విరివిగా అందరూ నాటాలి. రైతులను , ప్రజలను అధికారులు, ప్రజా ప్రతినిధులు , మొక్కలను నాటేందుకు ప్రోత్సహించాలి. మొక్కలు చక్కగా నాటి సంరక్షణ చేసిన గ్రామానికి చక్కటి బాధ్యత తో పని చెసిన అధికారులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తాం. మళ్ళీ ఆగస్టు 30 వ తేదీన సమీక్ష నిర్వహిస్తాను. ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయి మొక్కలను నాటాలి “అని అన్నారు.
