Home / ANDHRAPRADESH / కచ్చితంగా పవన్ బీజేపీతో కలిసి పనిచేసే అవకాశాలే కనిపిస్తున్నాయా.? పవన్ వ్యాఖ్యలపై ఆంతర్యం

కచ్చితంగా పవన్ బీజేపీతో కలిసి పనిచేసే అవకాశాలే కనిపిస్తున్నాయా.? పవన్ వ్యాఖ్యలపై ఆంతర్యం

ఇటీవల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనసేన పార్టీ విలీనంపై వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా విజయవాడలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని జాతీయ పార్టీలు తమతో కలిసి ప్రయాణం చేయాలని తమను కోరుతున్నాయని.. ఎవరితో కలిసినా లౌకిక పంథాను వీడబోమని జనసేన అధినేత స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలను కాపాడటంకోసం ఏర్పాటుచేసిన జనసేన పార్టీని మరే ఇతర పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల నూతన కమిటీ తొలి సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ అంశంపై ప్రసంగించారు.

బలమైన రాజకీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాడాల్సి రావడం, అనుభవం లేకపోవడం, డబ్బులు, మీడియా లాంటివి లేకపోవడంవల్లే జనసేన పార్టీ ఓడిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లే సాధించినా తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపట్ల తాను పార్టీని విలీనం చేయనని స్పష్టం చేసినా ఒకవేళ పొత్తు పెట్టుకుంటే లౌకికతత్వం వదులుకోనని చెప్పడం చూస్తే బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ రాజకీయాలవైపు తన అడుగులకు కారణం అన్నయ్య నాగబాబేనని పవన్ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat