Home / POLITICS / జయహో కేసీఆర్… తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చనున్న కాళేశ్వరం..!

జయహో కేసీఆర్… తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చనున్న కాళేశ్వరం..!

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయన ఏదైనా అనుకుంటే సాధించే వరకు పట్టు విడువరు. లక్ష్యాన్ని చేరుకునే దాకా విశ‌్రమించరు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, నేడు బంగారు తెలంగాణ సాధనలో ఆయన ఎన్నో అడ్డంకులు అధిగమిస్తూ అజేయుడిగా నిలుస్తున్నారు. ఎవరైనా అనుకున్నారా…తెలంగాణ రాష్ట్రం వస్తుందని..ఎవరైనా అనుకున్నారా..బీడు వారిన తెలంగాణ మాగాణుల్లో గోదావరి జలాలు పారుతాయని, అసలు ఎవరైనా ఊహించారా…పల్లానికి ప్రవహించే నీటిని పైకి ఎత్తిపోసి, తెలంగాణ నేలతల్లిని పునీతం చేస్తారని….అది కేవలం ఒక్క కేసీఆర్‌కే సాధ్యం…

Image result for kaleshwaram

పరమ శివుడి నెత్తిన ఉన్న గంగను…భువికి తీసుకువచ్చింది నాటి భగీరథుడు అయితే..కాళేశ్వర గంగను తెలంగాణ గడ్డపై పారించిన నేటి అపర భగీరథుడు..కేసీఆర్..అవును..ఇది కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యం.

60 ఏళ్లుగా తెలంగాణ నీటి కోసం గోస పడింది. తలాపున గోదావరి ఉన్నా సాగునీరు సంగతి దేవుడెరుగు..కనీసం గుక్కెడు తాగునీటికి తండ్లాడింది. కానీ రాష్ట్ర సాధకుడే పాలకుడు ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో..కేసీఆర్ పాలనే చెబుతుంది. కేసీఆర్ ఏం చేశాడు అన్నది…ఊరిలో పింఛన్ తీసుకున్న అవ్వను అడిగితే చెబుతోంది. రైతు బంధు అందుకున్న రైతన్న చెబుతాడు..కంటి వెలుగు కళ్లజోడు తీసుకున్న పెద్దాయన చెబుతాడు…కేసీఆర్ కిట్ అందుకున్న చెల్లెమ్మ చెబుతుంది. మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్న కుటుంబం చెబుతుంది. తొలి నాలుగున్నరేళ్లలోనే తెలంగాణ ప్రజల బతుకులకు ఆలంబనగా నిలిచారు..కేసీఆర్.

Image result for kaleshwaram

నాగరికతలు అన్నీ నదుల వెంటనే అభివృద్ధి చెందాయి. జలమే జీవాధారం గ్రహించిన కేసీఆర్…తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చేందుకు రీడిజైయినింగ్ ద్వారా అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టుగా కాళేశ్వరంను చేపట్టారు. గత పాలకులు తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ, తమ ఆంధ్రా ప్రాంతానికి మేలు కలిగేలా రూపొందించారు. ఏదో కంటితుడుపు చర్యగా తెలంగాణ ప్రజల కోసం చేపట్టిన ప్రాజెక్టులన్నీ దశాబ్దాలుగా నత్తనడక నడిచాయి. సాగునీటి రంగంపై కేసీఆర్‌కు ఉన్న పట్టు చూస్తే మహామహా ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఉద్యమం సమయం నుంచే సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పారు. అసెంబ్లీలో ఏకంగా కాళేశ్వరంపై ఏకధాటిగా ప్రెజెంటేషన్ ఇస్తే ప్రతిపక్ష నాయకులు తోక ముడుచుకుని పారిపోయారు. ముఖ్యమంత్రి కాగానే సాగునీటి రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పరిగెత్తిస్తూనే కాళేశ్వరం, భక్తరామదాసు, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల, మల్లన్నసాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. భక్తరామదాసును కేవలం 11 నెలల్లో పూర్తి చేసి కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెంను సస్యశ్యామలం చేశారు.

Image result for kaleshwaram

ఇక తెలంగాణకు జీవాధారమైన కాళేశ్వరం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయించారు. కాళేశ్వరాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు, కుహన మేధావులు ఎన్నో కేసులు వేశారు. నిర్వాసితుల పేరుతో ప్రజలను రెచ్చగొట్టారు. అయినా కేసీఆర్ మనోబలం ముందు ఆ కుట్రలు ఫలించలేదు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడడం మీకు ఇష్టం లేదా అని కోర్టులు సైతం కాళేశ్వరంపై కేసులు వేసిన ప్రతిపక్షాలకు చివాట్లు పెట్టాయి. అసలు కాళేశ్వరం నిర్మాణమే. అతిపెద్ద సవాలు…ప్రపంచంలోనే ఇంతటి క్లిష్టమైన ప్రాజెక్టు కనిపించదు. కేసీఆర్ పర్యవేక్షణలో వందలాది మంది ఇంజనీర్లు, వేలాది మంది కార్మికులు కాళేశ్వరం నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా భావించి పూర్తి చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వంటి మూడు ప్రధాన బ్యారేజీలు, 20 లిఫ్ట్‌లు, 19 పంపుహౌజ్‌లు, ఆసియా ఖండంలోనే అతి పెద్ద 203 కి.మీ. పొడవైన టన్నెల్, 1531 కి.మీ.ల మేర గ్రావిటీ కెనాల్స్‌తో ఇంతటి భారీ ప్రాజెక్టును కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌దే. 169 టీఎంసీలతో 13 జిల్లాలలో 38 లక్షల ఆయకట్టుకు సాగునీరు…హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు 30 టీఎంసీల తాగునీరు, గ్రామాలకు 10 టీఎంసీల తాగునీరు, పరిశ్రమలకు 16 టీఎంసీలు…ఇలా తెలంగాణ బతుకుచిత్రాన్ని మార్చనుంది కాళేశ్వరం.

Related image

దేశంలోనే కేవలం మూడేళ్లలోనే పూర్తయిన అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమే.ఇప్పుడు కాళేశ్వరం దేశానికే రోల్ మోడల్. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలంటే…ముందుగా కాళేశ్వరాన్ని అధ్యయనం చేయాల్సిందే. ఇంత వేగంగా ఒక బ‍ృహత్తర ప్రాజెక్టును నిర్మించిన దాఖలాలు చరిత్రలో లేవు..దీనికంతటికి కారణం..కేవలం సీఎం కేసీఆర్ దార్శనికత. సాగునీటి దౌత్యంలో ఓ చరిత్ర..కాళేశ్వరం. పొరుగు రాష్ట్రాలతో సాగునీటి దౌత్యం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చని నిరూపించిన ఘనత నిస్సందేహంగా కేసీఆర్‌దే. ఇప్పటికే ప్రాణహిత, గోదావరి జలాలను పంపులు ఎత్తిపోస్తున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు జలకళలు సంతరించుకున్నాయి. ఎండిన మాగాణుల్లో గోదావరి గలగలా పారుతోంది. కాళేశ్వరం జలాలతో అడుగంటిన భూగర్భ జలాలు కూడా పైకి ఉప్పొంగడం రైతన్నలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జీవితంలో తాము ఎన్నడూ చూడని అద్భుతాన్ని చూస్తున్నట్లు తెలంగాణ రైతన్నలు కాళేశ్వరం జలాలను చూసి కేరింతలు కొడతున్నారు..ఇప్పుడు తెలంగాణ సంబురంగా ఉంది.. కాళేశ్వరంతో తెలంగాణ ప్రజల బతుకు చిత్రం మారనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అవును..కాళేశ్వరం ముమ్మాటికి కేసీఆర్ విజయం. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం కానుంది. ఆయన చేతిలోనే తమ బతుకు భద్రంగా ఉంటుందని ప్రతి తెలంగాణ బిడ్డ భావిస్తుండడంలో అతిశయోక్తి లేదు..ఇప్పటికీ, ఎప్పటికీ తెలంగాణకు రక్షకుడు కేసీఆర్ మాత్రమే…జయహో కేసీఆర్…!

Image result for kaleshwaram

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat