తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత ,మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ నిన్న ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 9 గంటలకు ఆయనను అపోలో దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని అపోలో వైద్యులు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి సోకడంతో ముఖేశ్‌గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అపోలో హాస్పిటల్‌కు వెళ్లి ముఖేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మాట వాస్తవమేనని ముఖేశ్‌గౌడ్ కుమారుడు విక్రమ్ తెలిపారు. ఆయనకు అపోలో హాస్పిటల్ ఐసీయూలో చికిత్స జరుగుతున్నదని పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి తామే వివరాలు వెల్లడిస్తామని, వదంతులను ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు.
Tags aicc aravind gowd congress ex minister mukhesh gowd rahul gandhi slider Sonia Gandhi telangana congress tppcc uttam kumar goud