ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరిగింది.ఆకరి బంతి వరకు మ్యాచ్ నువ్వా నేనా అంటూ సాగింది. అయితే ఈ మ్యాచ్ లో ఎంతో వివాదాస్పదంగా మారిన ఆ రనౌట్ మల్లా తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్ గ ఉన్న కుమార ధర్మసేన తాను తీసుకున్న నిర్ణయం తప్పని ఒప్పుకున్నపటికీ ఐసీసీ మాత్రం అంపైర్ ను వెనకేసుకొచ్చింది. తాను తీసుకున్న నిర్ణయం సరైనదని ఆ సమయంలో టీవీ అంపైర్ ని అడిగే అవకాశం ఉండదని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డెస్ చెప్పడం జరిగింది. దీంతో ఆ సమాధానానికి అందరు షాక్ అయ్యారు.