Home / SLIDER / త్వరలో తెలంగాణ యాంటీ బయాటిక్స్‌ విధానం

త్వరలో తెలంగాణ యాంటీ బయాటిక్స్‌ విధానం

జలుబొచ్చినా, సాధారణ జ్వరమొచ్చినా మరో ఆలోచన లేకుండా చీటిపై యాంటీ బయాటిక్స్‌ను రాసే వైద్యులున్నారు. వేగంగా కోలుకోవాలని తక్కువ ఖర్చులో చికిత్స అయిపోవాలనే తాపత్రయంతో వైద్యుని సలహా లేకుండానే సొంతంగా యాంటీ బయాటిక్స్‌ను వినియోగించే వారూ ఉన్నారు. ఎప్పుడో చిట్టచివరి అస్త్రాలుగా వినియోగించాల్సిన ఈ ఔషధాలను.. ఇలా చిన్నాచితకా అనారోగ్య సమస్యలకు వినియోగించడం వల్ల నానాటికీ సూక్ష్మక్రిములు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఎంతకీ లొంగకుండా మొండిగా తయారవుతున్నాయి. అవసరం లేకపోయినా యాంటీ బయాటిక్స్‌ను వాడడం ఇటీవల కాలంలో తీవ్రమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థే హెచ్చరించింది. ఇది ప్రమాదకరమైన సంకేతంగా పరిగణనలోకి తీసుకొని అన్ని దేశాలూ దీని వాడక నియంత్రణపై దృష్టిపెట్టాలని సూచించింది. ముఖ్యంగా పిల్లల్లో విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల వాళ్లు ఊబకాయులుగా మారతారని శాస్త్రీయంగా రుజువైందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వీటి వాడకం పెరిగిందని వైద్యవర్గాలు గుర్తించాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా ఈ ఔషధాలను వినియోగించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. వీటి వాడకాన్ని నియంత్రించడానికి ప్రత్యేకంగా తెలంగాణ యాంటీ బయాటిక్స్‌ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది.

విధాన రూపకల్పన ఇలా..
———————————————-

* ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థల నుంచి వేర్వేరు విభాగాలకు చెందిన నిపుణులతో కమిటీని నెలకొల్పుతారు.

* ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్య నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తారు.

* 90 శాతం ఇన్‌ఫెక్షన్లకు సాధారణ యాంటీ బయాటిక్స్‌ ఔషధాలిస్తే తగ్గిపోతాయి. కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లకు మాత్రమే తీవ్ర మోతాదు కలిగిన యాంటీ బయాటిక్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందులను ఎప్పుడెప్పుడు, ఎలా వినియోగించాలనే విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించే విధంగా వైద్యులకు తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

* ఒక రోగికి అవసరం లేకపోయినా అత్యధిక మోతాదు కలిగిన యాంటీ బయాటిక్స్‌ను వినియోగించారని తేలితే.. అందుకు బాధ్యులైన వైద్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.

* ప్రత్యేకంగా యాంటీ బయాటిక్స్‌ విధానాన్ని అమలు చేయడం ద్వారా అతి, అనవసర వాడకాన్ని నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

* దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేస్తోంది. త్వరలో ఇది కార్యరూపం దాల్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat