అవినీతికి ఆస్కారం లేనిదే ఆసరా పధకమని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 57 ఏండ్లు నిండిన వారికీ త్వరలో ఫించన్లు మంజూరు కానున్నాయని ఆయన వెల్లడించారు.పెరిగిన ఫింఛన్ల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు నేరుగా అందించేందుకు గాను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యపేట నియోజకవర్గం పరిధిలోని సూర్యపేట, ఆత్మకూర్(యస్),చివ్వేంల మండల పరిధిలోని బాలేంల,కందగట్ల, నెమ్మికల్,ఆత్మకూర్ యస్,దాచారం ,పాచ్యానాయక్ తండా,చివ్వేంల, బండమీద చందుపట్ల,తిమ్మాపురం,తుల్జారావు పేట తదితర గ్రామాలలో సుడిగాలి పర్యటన జరిపారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో జరిగిన సమావేశలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో మొదలైన ఫించన్లు నేరుగా లబ్ధిదారులకు అందేలా ప్రణాళిక రూపొందించి అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనియుడని ఆయన కొనియాడారు.
ఇప్పుడు ఫించన్ లు అందుకుంటున్న లబ్ధిదారులు ఒక్కసారి అయిదు సంవత్సరాలు వెనకికి తిరిగి చూసుకోవాలని ఆయన ఉపదేశించారు.సీమాంద్రల ఎలుబడిలో మన ప్రాంతం ఎటువంటి అసమానతలకు,అవమానాలకు లోనైన అంశం ఈ సందర్భంలో ప్రస్తవానర్హమే అని ఆయన సంభోదించారు.మన రాష్ట్రం వస్తే నే మననిధులు మనకు ఉంటాయన్న నాటి ఉద్యమ సారధి ,నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ సమయంలో చెప్పిందే కొత్త రాష్ట్రంలో ఆయన నాయకత్వంలో అమలౌతుందని ఆయన చెప్పారు.70 రూపాయలతో మొదలు పెట్టిన ఫించన్లు 200చేరే నాటికే ఎన్ని అవకతవకలు, అక్రమాలు జరిగాయాన్నది జగద్విదితమే అన్నారు .జేబులు తడపందే రాలని ఫించన్ పద్ధతి నుండి రాజాకీయాలకు అతీతంగా ఫించన్లు అందుకునే రోజు రావడమే స్వరాష్ట్రంలో సుపరిపాలన గా ఆయన అభిప్రాయపడ్డారు.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణా లో 3.50 కోట్ల ప్రజల కండ్లలోవెలుగులు నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ తాపత్రయం అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. మన రాష్ట్రంలో మన నిధులు మనకే సొంతం అంటూ ఉద్యమ సమయంలో చెబుతున్న మాటలు ఇప్పుడు అక్షర సత్యమౌతున్నాయన్నారు.తెలంగాణా రాష్ట్రంలో ఫింఛన్ల మీద ఖర్చు పెడుతున్న 12 వేల కోట్ల రూపాయలే ఇందుకు అద్దం పఫుతోందన్నారు.57 ఏండ్లు నిండిన వారికి త్వరలో ఫించన్లు మంజూరు కానున్నాయని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై సర్వే జరుగుతోందని తుది నివేదిక చేతికి రాగానే ఫించన్లు మంజూరు కావడం ఖాయమన్నారు.
2014ఎన్నికలలో ఇచ్ఛిన హామీలన్నింటిని అమలుపరిచినందునే 2018 ఎన్నికలలోనూముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదించి పట్టం కట్టారని ఆయన అన్నారు.ఆ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు ఎన్నికల కోడ్ అడ్డుగా నిలిచిందని ….అడ్డు తొలగగానే ఉత్తర్వులు జారీ చేసి ధ్రువపత్రాలను మీ ముందుకు తీసుకొచ్చామని ఆయన ప్రజల హర్షద్వానాల మధ్య పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో వర్ధిల్లన రోజునే బంగారు తెలంగాణా నిర్మాణం పూర్తి అయినట్లని ఆయన చెప్పారు .సూర్యపేట జిల్లా ప్రజలకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారని ఆయన చెప్పారు.అయితే అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించి హరితహారం విజయవంతం చెయ్యాలని ఆయన అభ్యర్ధించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చేయిర్మన్ గుజ్జ దీపికా యూగందర్ రావు, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సూర్యపేట ఆర్ డి ఓ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Tags cm kavitha kcr ktr slider telanganacm telanganacmo trs trs governament