Home / 18+ / బీసీ డిక్లరేషన్ ను అడ్డుకునేందుకే ఈ డ్రామాలు.. టీడీపీ డ్రామాలింకా మానలేదా.?

బీసీ డిక్లరేషన్ ను అడ్డుకునేందుకే ఈ డ్రామాలు.. టీడీపీ డ్రామాలింకా మానలేదా.?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను అంశంపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుల సస్పెన్షన్‌కు వరకూ దారి తీసింది. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఒకటే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీ డిక్లరేషన్ ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు.

దీనిని అడ్డుకునేందుకు టీడీపీకి శతవిధాలా ప్రయత్నించింది. దీంతో సీఎం కూడా వారిపై ఫైరయ్యారు. ఈర్ష్యతో టీడీపీ రాద్ధాంతం చేస్తుందని ఆగ్రహించారు. ప్రతిరోజు ఒక అబద్ధాన్ని తీసుకొని టీడీపీ రాద్ధాంతం చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు. ప్రజలు మా మేనిఫెస్టోను నమ్మే అధికారం ఇచ్చారన్నారు. మేనిఫెస్టోకు మనసా, వాచా కట్టుబడి ఉన్నామన్నారు. అయతే సభ సజావుగా జరిగి, చర్చ జరిగి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కారణంతో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నట్టు స్పష్టమైంది. అలాగే బీసీల్లో వైసీపీ ప్రభుత్వానికి మంచిపేరు రాకుండా చేయాలనే ఉద్దేశంతో టీడీపీ అసెంబ్లీ వేదికగా ఆందోళనలు చేపట్టినట్టు అర్ధమవుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat