ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి కొంత కాలం గవర్నర్‌గా నరసింహన్ గారు కొనసాగి ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ గవర్నర్‌కు వీడ్కోలు పలకడం ఓవైపున బాధగా ఉన్నా, మరోవైపు ఆయన మనతోనే ఉంటారన్న నమ్మకం ఉందన్నారు. తనకు నాన్నగారిలా అనేక సలహాలు ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక కూడా నన్ను ముందుండి నడిపించారు. మరి కొంతకాలం ఆయన కొనసాగితే బాగుండేదన్నారు. పెద్దాయన స్థానంలో ఆయన్ని ఎప్పుడూ మా మనసులోనే ఉంచుకుంటామన్నారు. కాగా ఇప్పటివరకూ రెండు తెలుగురాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులు కావడంతో నరసింహన్ ఇక మీదట తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగనున్నారు. అయితే జగన్ మాత్రం గవర్నర్ కు సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకున్నారు.