బిగ్‌బాస్ షో ప్రారంభమైంది…ఇక ప్రతీఒక్కరి దృష్టి దీనిపైనే ఉంటుంది. అసలు మొదటగా హిందీ, బెంగాలీ భాషల్లో మొదలైన ఈ షో.. క్రమక్రమంగా దక్షిణాదిలో అడుగుపెట్టింది. ఈ షోకు ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. కన్నడలో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా తమిళంలో విజయవంతంగా మూడో సీజన్ జరుగుతుంది. ఇక మన విషయానికి వస్తే బిగ్‌బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ గా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడిపించాడు. ఇక రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించి సక్సెస్‌ఫుల్‌గా ముగించాడు. అయితే ఇందులో నాని కొంచెం తడబడిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత మూడో సీజన్‌ను గాడిలో పెట్టేందుకు అక్కినేని నాగార్జున ముందుకు రావడం జరిగింది.
తెలుగులో ఈ షోకు ప్రజాధరణ చాలా ఎక్కువనే చెప్పాలి.ఈ రియాల్టీ షో బిగ్‌బాస్ మూడో సీజన్ ఆదివారం ప్రారంభమైంది. ఆదివారం తొమ్మిది గంటలకు ప్రారంభమైన షోలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అనంతరం ప్రేక్షకులతో మాట్లాడుతూ బిగ్‌బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి అన్ని పూర్తిగా వివరించడం జరిగింది.అయితే మొదటిసారి బిగ్‌బాస్ నాగ్ కు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. కంటెస్టెంట్లలో ఉన్న ముగ్గురుని నాగ్ సెలెక్ట్ చేసి వెల్కమ్ చెప్పాల్సిందిగా టాస్క్ ఇచ్చాడు.అలా ఆ ముగ్గురికి వెల్కమ్ చెప్పిన అనంతరం ఒక్కొక్కరుగా మిగతా 12మంది వచ్చారు.ఇలా మొదటిరోజు కంటెస్టెంట్లు అందరు హౌస్ లోకి ప్రవేశించారు. ఇక కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళ్తే..
*సావిత్రి
*రవికృష్ణ
*అషూ రెడ్డి
*జాఫర్
*హిమజ
*రాహుల్ సిప్లిగంజ్
*రోహిణి
*బాబా భాస్కర్
*పునర్నవి భూపాలం
*హేమ
*అలీ రెజా
*మహేష్ విట్టా
*శ్రీముఖి
*వరుణ్ సందేశ్, వితికా షేరు