నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి షాక్ ల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు,ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరుతున్న సంగతి విదితమే. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో నేత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఓడిపోయిన డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని సమాచారం. ఈ క్రమంలోనే అతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కన్నా లక్ష్మీనారాయణను కలిసినట్లు సమాచారం. అయితే త్వరలోనే చదలవాడ తన అనుచరవర్గంతో కల్సి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి..