ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు శనివారం నాడు విజయవాడలోని లెనిన్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఈ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్లు ఉండగా ఇంకా కొన్ని చోట్ల ఏర్పాటు చెయ్యాలని వినతులు వస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు ఎక్కువగా తాటాకు ఇల్లులు ఉండడంతో వీటి అవసరం ఎక్కువగా ఉండేదని. అయితే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టించడంతో చాలా వరకు ఈ సమస్య తగ్గిందని ఆమె చెప్పారు.మునుపటి ప్రభుత్వంలా కాకుండా ఇప్పుడు ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.
