ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు దేశమంతట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇంక అసలు విషయానికి వస్తే ఈ వరల్డ్ కప్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది.అయితే ఏ జట్టు ఐన సరే ప్రపంచకప్ కు రెండు, మూడేళ్ళ ముందునుండి కూడా కసరత్తులు జరుగుతాయి.ఎవరూ ఎలా అడుతున్నారు,ఎవరు ఫిట్ గా ఉన్నారని ఇలా ప్రతీకోణంలో పూర్తిగా పరిశీలించి చివరకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.ఇక భారత జట్టు విషయానికి వస్తే జట్టు మొత్తం బాగానే ఉన్న అందరు ఉహాగానాలతోనే బ్రతికేసారని చెప్పాలి.
సెలక్షన్ కమిటీ,కోచ్, కెప్టైన్ కోహ్లి పై ప్రస్తుతం విమర్శలు కురిపిస్తున్నారు.రాయుడుని జట్టులోకి తీసుకోకపోవడం,విజయ్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, సెమీస్ లో ధోని కన్నా ముందుగా కార్తీక్ ని పంపడం ఇలా ప్రతీ విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భారత్ ఓడిపోయిందని సీనియర్లు మండిపడుతున్నారు.ఎలాగు మరికొన్ని రోజుల్లో బీసీసీఐకి సెలక్షన్ కమిటీ,రవిశాస్త్రి,కోహ్లి ఓటమిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.ఈ ఒక్క ఓటమికి మూల్యం కోహ్లి కెప్టెన్సీ కే ఎసర పెట్టేలా ఉందని సమాచారం.ఒకవేళ అదే జరిగితే భారత్ కు రోహిత్ కెప్టెన్ అయ్యే అవకాసం ఉంది.