కెరీర్ ప్రారంభంలోనే తన అందచందాలు, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న హీరోయిన్ ఎవరంటే.. టక్కున వచ్చే సమాధానం కాజల్. కాజల్ సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లు పూర్తయ్యాయి. కెరీర్ ఆరంభం నుంచే విజయాలతో సంబంధం లేకుండా..వరుస సినిమాలు చేస్తోంది. మధ్య.. మధ్యలో కొత్త భామలు ఎంట్రీ ఇచ్చినా.. వారికి సైతం పోటీనిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే 50 సినిమాలు పూర్తిచేసుకున్న ఈమె తెలుగుతో పాటు తమిళ భాష చిత్రాల్లో కూడా తన సత్తా చాటుతోంది.
అయితే, తాజా సమాచారం మేరకు తమిళంలో హిట్టయిన ‘భోగన్’ చిత్రాన్ని రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్నారు. తమిళ ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన లక్ష్మణ్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తాడు. ఇక ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.