తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి .ఈ క్రమంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చే నెల తొమ్మిదో తారీఖున కానీ లేదా డిసెంబర్ తొమ్మిదో తారీఖున కానీ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి .
అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ పోటి చేసే అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేశారు అని వార్తలు వస్తున్నాయి . గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు .
తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జడ్చర్ల నియోజక వర్గం నుండి బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది సమాచారం .అందులో భాగంగానే రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి డీకే అరుణ ఇరువురి భేటీ సందర్భంగా వివరించారు అని కూడా రాజకీయ వర్గాల టాక్ .చూడాలి మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో కాలమే నిర్ణయించాలి .