ఉదయం 9 గంటలకు ప్రశ్నఒత్తరాలతో సభ ప్రారంభం కాగా…మంత్రి బుగ్గన 11 గంటలకు అసెంబ్లీలో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. సుమారు 2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఈమేరకు నవరత్నాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపకల్పన జరిగిందని సమాచారం… ఈ సందర్భంగా 2019-20 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. రూ.2లక్షల 27వేల 984 వందల 99 కోట్ల బడ్జెట్‌కు కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఇదే సమయానికి శాసన మండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ సమర్పిస్తారు. వ్యవసాయ బడ్జెట్‌ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు.ఈ బడ్జెట్ లో రైతుల పట్ల సీఎం చిత్తశుద్ధికి ఇదిగో నిదర్శనం అని చెప్పాలి.రైతులకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం వ్యవసాయానికి రూ.28 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.
