గురువారం ఉదయ ఏపీ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. 9 గంటలకు ప్రారంభమైన సమావేశానికి స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాల సమాయాన్ని ప్రారంభించారు.టీడీపీ సభ్యలు మాత్రం కరువు, విత్తనాల కొరత వంటి అంశాలపై చర్చ చెయ్యాలని పట్టుబట్టడం జరిగింది.ఈ మేరకు స్పీకర్… ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని వారికి సూచించారు. ఈ సందర్భంగా సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముందుకు వచ్చి ప్రతిపక్ష నాయకులు కావాలనే ఇక్కడ రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. బీఏసీలో నిర్ణయించినట్లుగానే సమావేశాలు జరుగుతాయని ఆయన వాళ్లకి గుర్తుచేశారు.అనంతరం కరువుపై చర్చిద్దామని ఆయన అన్నారు.ఈరోజు నుండి ఈనెల 30వ తేదీ వరకు ఈ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతేకాక అదేరోజున వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రత్యేకంగా సమర్పిస్తారు.