Home / SLIDER / 8,792 టీచర్ పోస్టుల భర్తీకి నేడు ప్రకటన..!

8,792 టీచర్ పోస్టుల భర్తీకి నేడు ప్రకటన..!

తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు , నిధులు ,నియామకాలే లక్ష్యంగా జరిగిన పోరాటాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రం లో తొలిసారిగా అధికారం చేపట్టిన అదికార టీఆర్ఎస్ పార్టీ గత మూడున్నర సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే . అందులో భాగంగా లక్ష కొలువులు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడుతున్నది. టీఎస్‌పీఎస్సీ ఈ రోజు 8,792 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయనున్నది. 4,779 ఎస్జీటీలకు, 1,754 స్కూల్ అసిస్టెంట్లకు, 985 లాంగ్వేజ్ పండిట్లకు, 374 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది. వీటితోపాటు ఉర్దూ మీడియంలో 636 ఎస్జీటీలకు, 196 స్కూల్ అసిస్టెంట్లకు, 26 లాంగ్వేజ్ పండిట్లకు, 42 ఫిజికల్ డైరెక్టర్లకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సమాచారం. మొత్తం ఐదు క్యాటగిరీలుగా విభజించి, ఐదు నోటిఫికేషన్లు జారీచేయనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రిపరేషన్‌కు రెండునెలల గడువు ఇస్తారు. మూడునెలల నుంచి మూడున్నర నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తారని సమాచారం.

ఈ దఫా ఎస్జీటీల్లో ఇంగ్లీష్ మీడియం పోస్టులను సైతం భర్తీ చేయనున్నారు. వీటికితోడుగా గతంలోని ఉర్దూ, తెలుగు ఎస్జీటీలు యథావిధిగా ఉండనున్నాయి. టీఆర్టీ సిలబస్‌లో ఏవిధమైన మార్పులూ చేయటం లేదు. డీఎస్సీ తరహాలోనే టీఆర్టీ నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణ అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పాతపద్ధతిలోనే ఒకే పేపర్ ద్వారా భర్తీ ప్రక్రియ జరుగనున్నది. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన జిల్లాను స్థానికంగా పరిగణిస్తారు. గతంలో ఇతర జిల్లాలో ఓపెన్ కోటాలో ఉద్యోగం సాధించాలనుకునేవారు ఆ జిల్లాకు వెళ్లి పరీక్ష రాసేవారు. అయితే ఈ దఫా పరీక్ష సమయంలో కాకుండాఎంపిక సమయంలో ఆప్షన్ ఇచ్చుకొని ఓపెన్ కోటా పోస్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. పీఈటీ అభ్యర్థులకు టెట్ అర్హత తప్పనిసరేం కాదు. కొలువులకు సంబంధించిన రోస్టర్ పాయింట్లను, జిల్లాలవారీ స్థానికత అంశాలను, ఇతరత్రా అంశాలను టీఎస్‌పీఎస్సీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, న్యాయపరమైన చిక్కులు రాకుండా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది. త్వరితగతిన నోటిఫికేషన్ జారీకి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు సమాచారం. లక్ష ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీస్, సింగరేణి, విద్యుత్, గురుకులాల్లో సహా పలుశాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. గురుకులాల్లో తొమ్మిది వేల పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరినట్టు సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat