ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 5.30 తరువాత సెక్రటరియేట్లో ఉండాల్సిన అవసరం లేదని సెక్రటేరియట్ సిబ్బందికి తేల్చి చెప్పేసారట.. అవునా నిజమా అని చాలామంది ఉద్యోగులు ఆశ్చర్యపోయారట.. అయితే సీఎం మాత్రం ఉదయం టైమ్‌కు రావాలి.. అలాగే తప్పకుండా ఉదయం టైంకి రంటి మళ్లీ సాయంత్రం టైంకి వెళ్ళిపోండి.. మీ మీ వర్క్ పక్కాగా చేయాలని అదేశించారట.. ఇదే ఫార్ములాతో జగన్ ముందుకెళ్తున్నారట.. కానీ తప్పకుండా వర్కింగ్ అవర్స్ లో సరిగ్గా సీరియస్ గా పనిచేయాలని కోరారట.. వర్కింగ్ హవర్స్ లో పనిచేయకుండా సాయంత్రం 7, 8 గంటల వరకూ సెక్రటరియేట్లో ఉంటే పనిచేస్తున్నట్లు కాదని అధికార వర్గాలకు సీఎం స్పష్టంగా చెప్పారట జగన్. కేవలం వర్క్ టైమింగ్ లోనే కాకుండా ప్రతీ విషయంలోనూ స్మార్ట్ గా పనిచేయాలన్నది జగన్ ఉద్దేశమట. సీఎంలోని ఈ యాంగిల్ చాలా బావుందంటున్నారు సచివాలయ సిబ్బంది. అలాగే ముఖ్యమంత్రి అయిన కొత్తలో వరుసగా సమావేశాలు పెట్టేయడం చూసి కొత్తలో ఇలానే ఉంటుందని కొందరు, అన్ని శాఖల గురించి తెలుసుకోవడానికి మాత్రమే అని చాలామంది అనుకున్నారట.. కానీ జగన్ మాత్రం రోజురోజుకూ ఇంకా స్పీడుగా, స్మార్ట్ గా ఉండడం చూసి ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారట.
Home / 18+ / వరుసగా సమావేశాలు పెట్టడంతో కొత్తలో ఇలానే ఉంటుందని కొందరు, శాఖల గురించి తెల్సుకోవడానికేనని కొందరు అనుకున్నారు కానీ జగన్
Tags ap assembly Chandrababu jagan secreteriat tdp Timings ysrcp