ప్రతి ఏడాది మే 12 నాడు ఇంటర్నేషనల్ నర్సస్ డే సందర్భంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే “ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్”
ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుండి సీనియర్ నర్స్ ఆస్కా సలోమీ (ASKA SALOMI)గారికి వచ్చింది..ఈ నెలలో ఆమె ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకొనున్నారు.ఈ సందర్భంగా సికింద్రాబాద్ నందలి స్వగృహంలో ఆమెను కలసి అభినందించిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థకులు లక్ష్మణ్ రూడవత్..వెల్ టెక్ ఫౌండేషన్ చైర్మన్ చిలుపూరి వీరాచారి గారు,ఈ సందర్భంగా వీర చారి గారు మాట్లాడుతూ సరోజిని దేవి వైద్యశాలలో ( 1971)ఆమె నర్సింగ్ జీవితం మొదలు పెట్టిన ఆమెగాంధీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కి ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ పదవివిరమణ పొందారు..
ప్రస్తుతం నర్సింగ్ సేవలు చేస్తున్న వారు ఈమెను ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలి అని నేటి నర్సింగ్ సమాజానికి ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో విజయ కుమార్ సెక్రటరీ వెల్ టెక్ ఫౌండేషన్, శ్రీనివాసా చారి ఉపాధ్యక్షులు,సభ్యులు, రాజేష్, విద్యాసాగర్, కృష్ణ, మొదలగు వారు పాల్గొన్నారు.