రంగుల ప్రపంచంలో కాంట్రవర్సిటీలు లేనిదే వేషాలు వచ్చేటట్లు లేవు. ఈ విషయం ఇప్పుడు చాలా మంది నటీనటులు నమ్ముతున్నారు. జనాల నోళ్లలో పదే పదే నలిగే వారికి ఉన్న క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకుందామనుకుంటారు. అందుకే ముందుగా జనాల నోళ్లలో మంచికో.. చెడుకో నలగాదల్సిందే. ఇప్పుడు దంగల్ నటి ఫాతిమా సనా షేక్ అదే చేస్తోంది. గత కొంతకాలంగా తనకు వార్నింగ్ లు, బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియా ఖాతాల్లో కొందరు అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్నారని వాపోతున్న దంగల్ నటి ఫాతిమా సనా షేక్ మరోసారి వార్తల్లో నిలిచింది.
అయితే ఈ సారి కాస్తంత వగలుపోతూ.. మరికాస్త బోల్డ్‌గా ఓ సెల్ఫీ తీసుకుని, నా షేమ్ లెస్ సెల్ఫీ ఇదే అంటూ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది.అంతే సోషల్ మీడియాలో బాంబు పేలినట్లైంది. ఆ సెల్ఫీ పెట్టిన నాటి నుంచీ కామెంట్ల వర్షం మొదలయ్యింది. అది ఆ తర్వాత తుఫాను గా, మరికొద్ది సేపట్లోనే సునామీగా రూపు దాల్చింది. నువ్వు నిజంగా సిగ్గులేకుండానే ఇలాంటి ఫోటో పెట్టావని కొందరు తిడితే, ఈ ఫోటోలు నీపై గౌరవాన్ని తగ్గిస్తున్నాయని మరికొందరు నిప్పులు చెరిగారు. ఈ ఫోటో దాదాపు లక్ష లైకులు సంపాదించగా, వేల కామెంట్లు తెచ్చుకుంది. ఇటీవలి బీచ్‌లో కూర్చుని ఉన్న ఫోటోను ఫాతిమా పోస్టు చేసిన సంగతి తెలిసిందే.