లక్ష్మీ పార్వతి..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పై మరోసారి ధ్వజమెత్తారు.ఆమె ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి మాజీ మంత్రి లోకేష్ పై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే ముందు లోకేష్ ను పార్టీ నుండి తప్పించాలని,అప్పుడే పార్టీ మంచిగా ఉంటుందని లేకుంటే టీడీపీ భ్రష్టు పడుతుందని అన్నారు.లోకేష్ మరోసారి ఆడవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని గట్టిగా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మంచి పాలన జరుగుతుందని..దాన్ని చెడగొట్టే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుందని అన్నారు.