తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం చాలా రసవత్తరంగా జరిగింది .ఉదయం పదకొండున్నర గంటలకు జరిగిన ఈ భేటీ లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ,మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహుల మద్య వార్ కొనసాగింది అని సమాచారం .
ఈ భేటీ అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆఫీసు మెట్లు ఎక్కే అర్హత కూడా రేవంత్ కు లేదని అన్నారు. పార్టీ సమావేశానికి రేవంత్ ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. టీటీడీపీని రేవంత్ నాశనం చేశారని… ఓటుకు నోటు కేసుతో పార్టీ పరువును నాశనం చేశారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన టీడీపీ జాతీయ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.