ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విధితమే.జగన్ తీసుకున్న నిర్ణయాలకు ఏపీ ప్రజలు ఫిదా అవుతున్నారు.ఏపీలో నిరుద్యోగులకు నాలుగు లక్షల ఉద్యోగాలు తీసాడు.అవి గ్రామ వాలంటీర్లు కాగా ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది.దీనిపై స్పందించిన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ వ్యవస్థలో వీఅర్వో దగ్గరనుండి కలెక్టర్ వరకు అధికారులు అందరు ఉంటారని తెలియజేసారు.అప్పటి ప్రభుత్వంలో టీడీపీ హయంలో జరిగిన జన్మభూమి కమిట్టీలో టీడీపీ నాయకులే విచ్చలవిడిగా సొమ్ము దోచుకున్నారని.ఎవరిని లెక్క చేసేవారు కాదని అన్నారు.కులం,మతం అనే బేధాలు లేకుండా అందరికి అన్ని వర్తిస్తాయని అన్నారు.ఇందులో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ‍్వరూ జోక్యం చేసుకోరు.మీకు ఏ సమస్య వచ్చిన నేరుగా సీఎం పేషీలో కాల్ చేస్తే 48గంటల్లో పరిష్కరిస్తారని అన్నారు.