అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో కియా మోటార్స్ ఉన్న విషయం అందరికి తెలిసిందే.అప్పటి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయంలో ఇది ఇక్కడ పెట్టగా,దీనికి చాలా ఎకరాలు రైతుల దగ్గరనుండి తీసుకోవడం జరిగింది.దానికి బదులుగా స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని హామీలు కూడా ఇవ్వడం జరిగింది.తీరా సంస్థ స్థాపించిన తరువాత మొదటికే మోసం చేసారు.కియా పేరుతో కొన్ని వేలకోట్లు నొక్కేసారు.కాని ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామిలన్ని నిర్వేర్చే పనిలో పడింది.ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ కియా పరిశ్రమను పరిశీలించారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన మంత్రి అక్కడ ప్రరిస్థితులు మొత్తం వివరంగా తెలుసుకున్నారు.ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కియా యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు.దానికి యాజమాన్యం కూడా ఒప్పుకున్నారని చెప్పారు.