ప్రపంచకప్ లో భాగంగా రేపు ఆదివారం మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది.ఆతిధ్య ఇంగ్లాండ్,ఇండియాకు రేపు మ్యాచ్ జరగనుంది.అయితే రెండు జట్లు ఇప్పటి వరకు బ్లూ జెర్సీ లు వేసుకోవడం జరిగింది.అయితే ఐసీసీ నిబందనలు ప్రకారం ఇప్పుడు ఆటగాళ్ళు ఆరంజ్ కలర్ జెర్సీ వేసుకోనున్నారు.ఇప్పుడు ఆడే మ్యాచ్ లలో ఏ రెండు జట్లు ఒకే కలర్ జెర్సీ వేసుకోకుడదు దీంతో ఇండియా రేపు ఆరంజ్ దుస్తులు ధరించనుంది.ఈ మేరకు భారత్ ఆటగాళ్ళు జెర్సీ వేసుకొని స్టిల్స్ కూడా ఇచ్చారు.ప్రస్తుతం ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో హలచల్ చేస్తున్నాయి.
