తెలంగాణలో నిరుపేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉండి ఆదుకుంటున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఎర్ర రాజిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా అతడి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్.ఓ.సి.ని బాధిత కుటుంబసభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పేదలకు కేసీఆర్ గారు అండగా ఉన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కోoపెల్లి ధర్మరాజు,అంబటి రాజాస్వామి,ముదిగొండ కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.