వానకాలంలో జలుబు,జ్వరం చాలా తేలిగ్గా వచ్చేస్తాయి. కావున ఇప్పుడు చెప్పబోయే సూచనలు,సలహాలు పాటించి ఈ సీజన్లో వీటి భారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు
రుతుపవనాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సమయంలోనే డెంగ్యూ,మలేరియా మరియు పలు అంటువ్యాధులు సోకుతాయి. కాబట్టి ఇవి రాకుండా చూస్కోవాలి
ఈ కాలంలో స్ట్రీట్లో దొరికే స్ట్రీట్ ఫుడ్స్ తినవద్దు. ఫ్రీకట్ ఫుడ్స్ తినడం మానేయాలి. చాలా ఎక్కువగా మంచినీరు త్రాగాలి. ప్రతిరోజు వ్యయామం అవసరం..వానకాలంలో మాంసం తినడం తగ్గించాలి.ఒకేసారి కుంభానుకుంభాలుగా తినకుండా కొంచెం కొంచెం తినాలి.డైటింగ్ చేస్తుంటే ఆకుకూరలుతినవద్దు. ప్రతిసారి మన చేతులను పరిశుభ్రంగా కడుక్కొవాలి.
ఈగలు,దోమలు ఎక్కువగా ఉండేకాలం కాబట్టి ఆహారం నిల్వచేసే పాత్రలపై మూతలు సరిగా పెట్టాలి. డైలీ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి.వంటగది,ఇంటిని శుభ్రం చేసే సమయంలో హైక్వాలిటీ యాంటిసెప్టిక్ సబ్బులను వాడాలి. దోమలు ఎక్కువగా ఉంటే దోమతెరలు,కాయిల్స్ వాడాలి.వానలో తడిచిన కానీ తడిబట్టలు మీద ఉండకుండా ఎప్పటికప్పుడు మార్చేయాలి. వీలైనంతవరకు వేడినీళ్లతో స్నానమాచరించాలి.ఒక కప్పు వేడి వేడి అల్లం ఛాయా త్రాగితే మంచిది.వానకాలం కాబట్టి రెయిన్ కోటును వాడటం చాలా ఉత్తమం. ప్రతిసారి ముఖాన్ని చేతితో తాకొద్దు.. ముఖాన్ని రుద్దొద్దు. తడిగోడలను నివారించాలి. నీటిని నిల్వ ఉంచకుండా చూడాలి..