నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ సారి అవినీతి అక్రమ అధికారులకు కాదు. రాజకీయ నేతలకు అసలే కాదు.సాక్షాత్తు కలెక్టర్లకు
ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ”వివిధ పనులపై తమ వద్దకు వచ్చే ప్రజాప్రతినిధులు సహా ప్రజలను జిల్లా
కలెక్టర్లు చిరునవ్వుతో ప్రేమగా పలకరించాలి. వారి సమస్యలను ఓర్పుతో సహానంగా వినాలి. దాదాపు రెండు లక్షల మంది ఓటేస్తేనే ఒకరు గెలుపొందారు.ఇది గుర్తు పెట్టుకుని అందరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్లకు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో పేదప్రజలు,వెనుకబడ్ద ,షెడ్యూల్ వర్గాలకు సర్కారు ప్రవేశ పెట్టి అమలుచేస్తోన్న పథకాల ఫలాలు అందరికీ అందేలా చూడాలని సీఎం జగన్ కోరారు. అయితే
సాక్షాత్తు జిల్లా కలెక్టర్లకే స్వీట్ వార్నింగ్ ఇచ్చి సీఎం జగన్ గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పలు అవినీతి అక్రమాలకు పాల్పడిన తమ పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముళ్లు తెగ కంగారు పడుతున్నారంటా..
