Home / ANDHRAPRADESH / బ్రేకింగ్ న్యూస్..ప్రజా వేదికను కూల్చేయమని వైఎ జగన్ ఆదేశం

బ్రేకింగ్ న్యూస్..ప్రజా వేదికను కూల్చేయమని వైఎ జగన్ ఆదేశం

వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని నిభందనలకు విరుధ్ధంగా ఉన్న ప్రజావేదికను నిర్మించారు. అవీనీతి ఏ స్థాయిలో ఉందో చెప్పాడానికి ప్రజావేదికలో మీటింగ్ పెట్టాం. ఈ బిల్డింగ్ లో ఇదే చివరి సమావేశం. ప్రజావేదికను వేంటనే కూల్చివేయమని ఆదేశాలు జారి చేశారు సీఎం జగన్ .అంతేకాదు అక్రమం నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడితే రక్షించేది ఎవరు అన్నది ప్రశ్నించడానికే తాను ప్రజావేదిక లో సమావేశం పెట్టానని ఆయన అన్నారు. ఇదే ఇక్కడ జరిగే కలెక్టర్ ల ఆఖరి సమావేశం అని ఆయన అన్నారు. అందుకే జిల్లా కలెక్టర్లు, సెక్రటరీలు, మంత్రులు అందరిని ఇక్కడకు రమ్మన్నానని ఆయన అన్నారు.పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి మనమే నిర్మాణాలు చేస్తే ఏమి చేయాలని అన్నారు. సామాన్యుడు ఎవరైనా అక్రమ నిర్మాణం చేస్తే ఊరుకుంటారా అని ఆయన అన్నారు. ఈ విషయాలను ప్రశ్నించడానికే తాను ఈ సమావేశం ఇక్కడ పెట్టానని ఆయన అన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat