వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా తేల్చకుండా… సాగదీస్తూ వెళ్లడం ఆశ్చర్యం కలిగించే అంశం. స్వయంగా సిట్ ఏర్పాటైనా ఫలితం లేదు. మరి కొత్త ప్రభుత్వం వేసిన సిట్ ఏం చేయబోతోంది. ఎప్పుడో ఎన్నికలకు ముందు జరిగిన హత్య. సాక్ష్యాధారాలు ఉన్నా… అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్… విషయం తేల్చకుండా… దర్యాప్తు చేస్తూనే వచ్చింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో… సిట్‌లో అధికారులు కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కొత్తగా నలుగురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 35 మంది పీసీలూ ఏర్పాటయ్యారు. ఇంతమందిని నియమించాక… ఇంకా దర్యాప్తును నాన్చితే కచ్చితంగా విమర్శలు తప్పవు. అందుకే మిస్టరీని ఛేదించేందుకు కొత్త బృందం సిద్ధమైంది. ఇప్పటికే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి నేత సతీష్ రెడ్డిని ప్రశ్నించారు. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజక వర్గం నుంచి వైఎస్ జగన్‌కి ప్రత్యర్థిగా పోటీ చేసింది ఈయనే. అలాగే జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ, వైసీపీ నేతలను పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు రావాలని డీఎస్పీలు ఆదేశించారు.
మార్చి 15న పులివెందులలోని సొంత ఇంట్లో వివేకానందరెడ్డిని ఎవరో చంపేశారు. ఇప్పుడు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పనిచేస్తున్న డీఎస్‌పీలు ఈ కేసు సంగతి చూస్తున్నారు. ఇదే ఇప్పుడు పులివెందుల, జమ్మలమడుగులోని టీడీపీ నేతల్లో టెన్షన్ పెంచుతోంది. లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటామన్న ఉద్దేశంతో చాలా మంది నేతలు ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. కొంతమందైతే ఇప్పటికిప్పుడు వెళ్లిపోలేక, తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు.
హత్య ఎవరు చేశారన్నది ఇప్పటికీ సస్పెన్సే. ఇది రాజకీయ హత్యా, దోపిడీ దొంగల పనా అన్నది మిస్టరీగా మారింది. హత్య జరిగిన రోజున అక్కడి బీరువాలో డబ్బులు మాయమయ్యాయి. అందువల్ల ఇది దోపిడీ దొంగల పని కావచ్చన్న వాదన ఉంది. అదే నిజమైతే… తన డ్రైవరే తనను చంపుతున్నాడని వివేకానందరెడ్డి రాసినట్లు ఉన్న ఆ లెటర్ సంగతేంటన్నది మరో మిస్టరీ. చంపినవాళ్లు శవాన్ని బెడ్ రూం నుంచీ… బాత్ రూం వరకూ ఎందుకు తీసుకెళ్లారన్నది మరో మిస్టరీ. ఇలా ఈ కేసులో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కోణాలు చాలా ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానాలు వెతకాల్సింది సిట్ అధికారులే.
See Also : స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు.
See Also : బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..ఆవేదనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
See Also : అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?
See Also : ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్