Home / SLIDER / టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించిన కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించిన కేటీఆర్

ఈ నెల 24న పార్టీ జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈమేరకు భూమి పూజ ఎర్పాట్లను ఈరోజు సమీక్షించారు. పార్టీ సీనియర్ నాయకులతో జరిగిన సమావేశంలో అయన అన్ని జిల్లాల పార్టీ లీడర్లు, మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. సోమవారం భూమి పూజ నిర్వహించే స్థలాలను ఈరోజే పరీశీలన చేయాలని ఈ సందర్భంగా వారిని కేటీఆర్ కోరారు. అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి పార్టీ అన్ని విధాల సహాకరిస్తుందని, నిర్మాణం సత్వరంగా పూర్తి అయ్యేట్లు చూడాల్సిన భాద్యత స్ధానిక నేతలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. పార్టీ కార్యాలయాల నమూనా పార్టీ అద్యక్షులు, ముఖ్యమంత్రి  కేసీఆర్  ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ నెల 24న జరిగే పార్టీ కార్యాలయాల భూమిపూజ కార్యక్రమ నిర్వహాణ కోసం జిల్లాల వారీగా పార్టీ ప్రతినిధులను కేటీఆర్ నియమించారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మంత్రులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, మంత్రులు లేనిచోట్ల నూతనంగా ఎన్నికైన జిల్లా జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిసి ఈ భూమిపూజ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల మద్యలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, పార్టీ సీనియర్ నాయకులు హజరు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ కోరారు.

జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాలకు శంఖుస్ధాపన చేసే వారి వివరాలు:

మంత్రులు:

కరీంనగర్ – ఈటల రాజేందర్

నిర్మల్ – అల్లోల ఇంద్రకరణ్రెడ్డి

నిజామాబాద్ – వేముల ప్రశాంత్ రెడ్డి

జగిత్యాల – కొప్పుల ఈశ్వర్

జనగాం – ఎర్రబెల్లి దయాకర్ రావు,

సూర్యాపేట – గుంతకండ్ల జగదీష్ రెడ్డి

మేడ్చల్ – సిహెచ్ మల్లా రెడ్డి

మహబూబ్ నగర్ – శ్రీనివాస్ గౌడ్

జోగులాంబ గద్వాల్ – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

జడ్పీ చైర్మన్లు:

అసిఫాబాద్- కోవా లక్ష్మి, మంచిర్యాల – భాగ్యలక్ష్మి, ఆదిలాబాద్- జనార్దన్ రాథోడ్, కామారెడ్డి- ధాపేధార్ శోభ, సిరిసిల్ల- అరుణ, పెద్దపల్లి- పుట్ట మధు, జయశంకర్ భూపాలపల్లి- శ్రీ హర్షిని, మహబూబాబాద్- అంగోత్ బిందు, ములుగు- కుసుమ జగదీష్, భద్రాద్రి కొత్తగూడెం- కోరం కనకయ్య, నల్లగొండ- బండా నరేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి- సందీప్ రెడ్డి, సిద్దిపేట-రోజా శర్మ, మెదక్-హేమలత, సంగారెడ్డి- పటోల్ల మంజుశ్రీ, రంగారెడ్డి- తీగల అనిత రెడ్డి, వికారాబాద్- పట్నం సునీత రెడ్డి, నారాయణపేట- వనజమ్మ, నాగర్ కర్నూల్ – పద్మావతి

See Also : స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు.

See Also : బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..ఆవేద‌న‌లో ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌

See Also : అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?

See Also : ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat