కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.ప్రతిష్టాత్మక కాళేశ్వరం విశిష్టతలు ఇవే.
-147 టీఎంసీల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం
-కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 80,500 కోట్లు
-కాళేశ్వరం నిర్మాణానికి ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ. 50 వేల కోట్లు
-ఈ ఎత్తిపోతల పథకంలో మొత్తం 19 పంపింగ్ హౌస్‌లు
-మొత్తం 19 పంపింగ్ హౌస్‌లలో 82 సంపులు, భారీ మోటార్లు
-కాళేశ్వరం కింద మొత్తం 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వల నిర్మాణం
-203 కిలోమీటర్ల మేర సొరంగం నిర్మాణం
-ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు ఎత్తిపోత
-భవిష్యత్‌లో రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రణాళిక
-కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలకు 4992 మెగావాట్ల విద్యుత్ వినియోగం
-ఈ ప్రాజెక్టుతో 13 జిల్లాల్లోని 106 మండలాలకు లబ్ధి
-కాళేశ్వరం ద్వారా 1581 గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు
-కాళేశ్వరంతో కొత్తగా 18.25 లక్షల ఆయకట్టుకు సాగునీరు
-మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు నీరు
-కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు
-పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు కేటాయింపు