ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా టీడీపీ రాజ్ సభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్‌రావులు ఆపార్టీకి పార్టీకి గుడ్‌బై చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయజనతాపార్టీలో చేరారు. ఈ నలుగురు గురువారం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వద్దకు వెళ్లి టీడీపీ రాజ్యసభను బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్రహోం మంత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి పనిచేస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వెంకయ్యవద్దకు వెళ్లే సమయంలో ఎంపీ గరికపాటి మోహనరావు హై బీపీతో పడిపోయారు.. వెంటనే మిగిలిన ఎంపీలు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ నలుగురు సభ్యులు టీడీపీని వీడితే రాజ్యసభ లో ఆ పార్టీకి ఇక మిగిలింది ఇద్దరు ఎంపీలే కాబట్టే దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోనున్నట్లు తెలుస్తుంది.