పోలీసుల వీక్లీ ఆఫ్ అమలు చేసే విషయంలో మానవతను చాటుకున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి తెలిపారు. భారతదేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందన్నారు. ‘మీ సీఎం మాటిస్తే వెనక్కు తగ్గరంట గదా’ అని పలువురు ఎంపీలు సెంట్రల్ హాల్‌లో తనతో అన్నారని ట్వీట్ చేశారు. గురువారం ట్విటర్ వేదికగా సీఎం వైఎస్ జగన్‌ను కొనియాడిన విజయసాయి రెడ్డి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ధ్వజమెత్తారు. కొడుకు, కుమార్తెలను బందిపోట్లుగా మార్చిన మాజీ స్పీకర్ కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా? అని చంద్రబాచుకు సవాల్ విసిరారు. కోడెల కుటుంబం బలవంతపు వసూళ్లతో వందల కోట్లు దోచుకుందని, అనేక మంది బాధితులు మిమ్మల్ని కలిసి వేడుకున్నా పట్టించుకోలేదని అంటున్నారని, కొంపదీసి మీకేమైనా అందులో వాటా ఉందా ఏమిటని సందేహం వ్యక్తం చేశారు.
వీక్లీ ఆఫ్ అమలు చేయడం ద్వారా పోలీసు సిబ్బంది విషయంలో మానవతను చాటుకున్నసిఎంగా జగన్ గారు చరిత్రలో నిలిచి పోతారు. దేశంలోనే ఇటువంటి సాహసం చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. మీ సీఎం మాటిస్తే వెనక్కు తగ్గరంట గదా అని పలువురు ఎంపీలు సెంట్రల్ హాల్‌లో నాతో అన్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 20, 2019
కొడుకు, కుమార్తెలను బందిపోట్లుగా మార్చిన మాజీ స్పీకర్ కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా చంద్రబాబూ గారూ? ఆ కుటుంబం బలవంతపు వసూళ్లతో వందల కోట్లు దోచుకుంది. అనేక మంది బాధితులు మిమ్మల్ని కలిసి వేడుకున్నా పట్టించుకోలేదని అంటున్నారు. మీకూ అందులో వాటా ఉందా ఏమిటి కొంపదీసి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 20, 2019