ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం విదేశాలకు చెక్కెస్తున్నారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లనున్నారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. విదేశీ పర్య్టటన అనంతరం ఆయన ఈ నెల ఇరవై ఐదు తారీఖున ఏపీకి తిరిగిరానున్నారు. అయితే గత కొన్ని రోజుల కిందటనే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాల్సిఉంది. కానీ నవ్యాంధ్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా వేసుకున్నారు. అయితే బాబు విదేశీ పర్యటనలో పలు అనుమానాలు ఉన్నాయని అధికార వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్ర్తమంగా సంపాదించిన ఆస్తుల లెక్క సరిచేసుకోవడానికే బాబు ఇలా డ్రామాలు ఆడుతూ విదేశాలకు వెళ్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.