తాజాగా వెలువడిన ఎన్నికల్లో ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఆపార్టీ కొత్తగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీటీడీలో నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. అయితే, తమ పదవీకాలం ఇంకా సంవత్సరం పాటు ఉన్నందున తాము రాజీనామా చేయమని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ ఇప్పటివరకూ భీష్మించుకు కూర్చున్నారు. ఆయన టీటీడీ బోర్డు సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుపై టీటీడీ బోర్డు సభ్యుడు చల్లాబాబు విమర్శలు చేయడంతో అధికారులు బోర్డు సమావేశాన్ని బహిష్కరించారు. అయితే ఎట్టకేలకు ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.